చండీఘడ్ : లిక్కర్ స్టోర్ కలెక్షన్ ఏజెంట్ ను సాయుధ దుండగులు బెదిరించి రూ ఆరు లక్షలు లూటీ చేసిన ఘటన గురుగ్రాం సెక్టార్ 18లో వెలుగు చూసింది. మద్యం దుకాణం నుంచి డబ్బులు సేకరించి బ్యాంక్ లో వేసేందుకు కలెక్షన్ ఏజెంట్ వెళుతుండగా సాయుధ దుండగులు బాధితుడిని భయపెట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపి నగదుతో స్విఫ్ట్ డిజైర్ కారులో ఉడాయించినట్టు పోలీసులు తెలిపారు.
ఘటన జరిగిన గంట తర్వాత పాలం విహార్ రోడ్డు వద్ద కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.