ఇందూరు : దీపావళి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలో మంగళవారం నుంచి గురువారం రాత్రి వరకు ఆయా మండల కేంద్రాలు, గ్రామాలు, పట్టణాల్లో పేకాటాడుతున్న వారిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ శుక్రవారం వెల్లడించారు. వీరి వద్ద నుంచి రూ.11,92,620 లు స్వాధీనపర్చుకున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ డివిజన్లో 48 కేసులు నమోదు కాగా 256 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.4,18,360లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఆర్మూర్‌లో 46 కేసులు నమోదు కాగా 207 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.3,24,030లు, బోధన్‌లో 63 కేసులు నమోదు కాగా 242 మంది అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4,50,230/-లు స్వాధీనపర్చుకున్నట్లు వెల్లడించారు. పండుగ సందర్భంగా పేకాట స్థావరాలను నియంత్రించడానికి ప్రత్యేక నిఘా, టీం, కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామన్నారు.