శనివారం 05 డిసెంబర్ 2020
Crime - Nov 22, 2020 , 22:11:21

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి

రంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు ప్రాణాలు కోల్పోయారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం జరిగింది. సీఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. బెంగుళూర్‌కు చెందిన రవి(30) భార్య త్రివేణి(26), కూతురు త్రిషిక (11నెలలు), తల్లిదండ్రులు నర్సింహమూర్తి(64) రమాదేవి(62)లతో యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వ్యాగనార్‌ కారు (కేఏ02 0856)లో బయల్దేరారు.

తెల్లవారుజామున 6 గంటల సమయంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొహెడ అవుటర్‌ రింగ్‌ రోడ్డు వద్దకు రాగానే కారు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జై త్రివేణి(26), చిన్నారి త్రిషికకు బలమైన గాయాలై ఘటనాస్థలంలోనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన రవితోపాటు అతడి తల్లిదండ్రులు నర్సింహమూర్తి, రమాదేవిలను చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.