కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీలో దారుణం జరిగింది. మైనర్ బాలికలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూల్లో విద్యార్ధినులను వేధిస్తూ వారిని బెదిరిస్తున్న హెడ్మాస్టర్ను అరుణ్ కుమార్ దత్‌గా గుర్తించారు.
బాలికలు హెడ్మాస్టర్ నిర్వాకాన్ని తల్లితండ్రులకు చెప్పడంతో స్కూల్ ఆవరణలో పేరెంట్స్ నిరసనలకు దిగడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఘటన విషయం బయటకు పొక్కడంతో బాలాఘఢ్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారని హుగ్లీ రూరల్ ఎస్పీ అమన్‌దీప్ తెలిపారు.