అత్యాచారం నుంచి అమ్మాయిని కాపాడిన శునకం
శునకం | శునకాన్ని విశ్వాసానికి మారుపేరుగా భావిస్తారు. అవి, తన యజమాని పట్ల ఎనలేని ప్రేమను చూపిస్తాయన్న సంగతి తెలిసిందే. తన యజమానిని శత్రువుల నుంచి

చిత్తూరు : శునకాన్ని విశ్వాసానికి మారుపేరుగా భావిస్తారు. అవి, తన యజమాని పట్ల ఎనలేని ప్రేమను చూపిస్తాయన్న సంగతి తెలిసిందే. తన యజమానిని శత్రువుల నుంచి కాపాడేందుకు కూడా శతవిధాలా ప్రయత్నిస్తాయి. తనను ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మాయి పట్ల ఓ కీచకుడు అత్యాచారం చేయబోతుంటే.. శునకం ఆమెను కాపాడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని గొల్లపల్లె గ్రామంలో చోటు చేసుకుంది.
బుధవారం రాత్రి 17 ఏండ్ల యువతి తన ఇంటి డాబాపై నిద్రిస్తుండగా.. ఓ యువకుడు(27) అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీంతో ఆమె కాపాడంటూ గట్టిగా కేకలు వేసింది. ఆ ఇంటి పెంపుడు కుక్క అప్రమత్తమైంది. ఆ శునకం పరుగున ఆమె వద్దకు వెళ్లిపోయింది. యువకుడిపై దాడి చేసి.. వీరోచితంగా పోరాడింది. చివరకు కుక్క అతన్ని కరిచింది. అప్పటికే ఇరుగుపొరుగు వారు మేల్కొని.. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ తప్పిపోయాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. యువతిపై అత్యాచారం చేసేందుకు యత్నించిన యువకుడిని పెనుమూరు బస్టాండ్‌లో గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Chittoor
- Dog
- Girl Abuse
- Gollapalle
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

