Hyderabad | బాలానగర్ ప్రధాన రహదారిపై ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగర పరిధిలోని బాలానగర్ ప్రధాన రహదారిపై ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగర పరిధిలోని బాలానగర్ ప్రధాన రహదారిపై ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి, ప్రయాణికులను కిందకు దించేశాడు.
ఈ ప్రమాదంలో క్షణాల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. కూకట్పల్లి నుంచి బాలానగర్ వైపు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. బస్సులో మంటలు చెలరేగడంతో ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

