Watch: వృద్ధుడి మీదుగా దూసుకెళ్లిన కారు… సీసీటీవీలో రికార్డు
న్యూఢిల్లీ: ఒక వృద్ధుడి మీదుగా కారు దూసుకెళ్లింది. ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో బుధవారం ఈ సంఘటన జరిగింది. ఒక వృద్ధుడు తన ఇంటి ముందు కుర్చీ వేసుకుని కుర్చొనేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ఇరుకైన ఆ సందులోకి ఒక కారు ప్రవేశించింది. కుర్చీని పట్టుకుని నిల్చొన్న వృద్ధుడి మీదుగా ఆ కారు దూసుకెళ్లింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం అనంతరం డ్రైవర్ డ్రైవర్ ఆ కారును ఆపకుండా వెళ్లిపోయాడు.
అయితే, ఉద్దేశపూర్వకంగా తన పైనుంచి కారును దూకించినట్లు ఆ వృద్ధుడు ఆరోపించాడు. పొరుగువారితో ఆరు నెలల కిందట జరిగిన గొడవే దీనికి కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సమీపంలోని ఇంటి సీసీటీవీలో రికార్డైన వీడియో ఫుటేజ్ను పరిశీలించారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి దారుణం జరిగింది. రోడ్డును దాటుతున్న ఒక వ్యక్తిపైకి ఎస్యూవీ వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సెంట్రల్ ఢిల్లీలోని జనపథ్లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న ఒక ఎస్యూవీ వాహనం నడుస్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 39 ఏండ్ల వ్యక్తి చనిపోయాడు. ఈ ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనాన్ని నిలుపకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటనను చూసి అక్కడున్న వారు షాకయ్యారు. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video Shows Horrific Accident In Central Delhi, SUV Runs Over Pedestrian https://t.co/9GpCje85xa pic.twitter.com/NTSnWqEg0U
— NDTV (@ndtv) March 30, 2022
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

