వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో షేర్ చేసిన అధికారిపై వేటు
అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో షేర్ చేసిన ఎక్సైజ్ అధికారిని సస్పెండ్ చేసిన ఉదంతం మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో వెలుగుచూసింది.
భోపాల్ : అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల వీడియో షేర్ చేసిన ఎక్సైజ్ అధికారిని సస్పెండ్ చేసిన ఉదంతం మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో వెలుగుచూసింది. డిపార్ట్మెంట్ నుంచి ఫిర్యాదు అందడంతో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అధికారి ఆర్పీ అహిర్వర్ను జిల్లా ఎక్సైజ్ అధికారి వికాస్ మంద్లోలి సస్పెండ్ చేశారు.
ఎక్సైజ్ శాఖ అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో ఆర్పి అహిర్వర్ మే 23న అశ్లీల వీడియోను షేర్ చేశారని, 24 గంటల తర్వాత వీడియోను డిలీట్ చేశారని మంద్లోలి తెలిపారు. గ్రూప్‌లో ఉన్న మహిళా ఉద్యోగులు అభ్యంతరకర వీడియోపై కలెక్టర్‌కు పిర్యాదు చేశారని చెప్పారు. శాఖాపరమైన విచారణలో అహిర్వర్ తప్పు చేసినట్టు వెల్లడికావడంతో అభ్యంతరకర ప్రవర్తనపై ఆయనను సస్పెండ్ చేశామని చెప్పారు.
మరోవైపు కుట్రపూరితంగా తనను ఈ వ్యవహారంలో ఇరికించారని నిందితుడు వాపోయాడు. అభ్యంతరకర వీడియోను తాను పోస్ట్ చేయలేదని, తాను ఆఫీస్‌లోని రెస్ట్‌రూంకు వెళ్లిన సమయంలో తన ఫోన్ నుంచి మరొక వ్యక్తి వీడియోను షేర్ చేశాడని ఆయన చెప్పుకొచ్చాడు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- mp
- obscense video
- officer
- sharing
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

