కిడ్నాప్ అయిన కుమార్తెను… ‘టేకెన్’ సినిమా తరహాలో రక్షించిన తండ్రి
ముంబై: కిడ్నాప్ అయిన కుమార్తెను ‘టేకెన్’ సినిమా తరహాలో ఆమె తండ్రి రక్షించాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల షాహిద్ ఖాన్, బాంద్రాలోని గార్మెంట్స్ తయారీ కర్మాగారంలో పని చేస్తున్నాడు. ఈ నెల 4న అదే ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. షాపింగ్ కోసం తనతో రావాలని ఆమెను పిలిచాడు. దీంతో పని ఉన్నదని ఇంట్లో చెప్పిన ఆ బాలిక, ఆ యువకుడి వెంట వెళ్లింది. అయితే ఆ యువకుడు ఆమెను కుర్లాకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సూరత్ వెళ్లే బస్సు ఎక్కారు. అనంతరం రైలులో ఢిల్లీ చేరుకున్నారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ అలీఘడ్ సమీపంలోని ఐత్రోలి గ్రామానికి ఆ బాలికను అతడు తీసుకెళ్లాడు.
మరోవైపు ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమార్తె తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాలిక కిడ్నాప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, రోజు వారీ కూలీ అయిన తండ్రి, తన కుమార్తె ఆచూకీ కనిపెట్టేందుకు ‘టేకెన్’ మూవీ తరహాలో చాలా ప్రయత్నించాడు. చుట్టుపక్కల వారిని, తెలిసిన వారిని ఆరా తీశాడు.
చివరకు షాహిద్ ఖాన్ తన గ్రామానికి బాలికను తీసుకెళ్లినట్లు ఆమె తండ్రి తెలుసుకున్నాడు. పోలీసులు, పొరుగువారి సహాయంతో నిందితుడి ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్ సంపాదించాడు. యువకుడి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడాడు. అక్కడి స్థానికులు, పోలీసుల సహాయంతో కుమార్తెను రక్షించుకున్నాడు. నిందితుడు ఆమెపై బస్సులో లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించి ఈ మేరకు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు.
అయితే పోలీసులు కిడ్నాప్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. బాలిక నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత మరిన్ని సెక్షన్లు కలుపుతామని నిర్మల్ నగర్ పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

