తల్లి ప్రేమను మించింది ప్రపంచంలో ఏదీ లేదంటారు. కానీ అంతటి ప్రేమను పంచాల్సిన తల్లే.. బిడ్డ పాలిట యమపాశమైతే? బెంగళూరులోని ఎస్ఆర్ నగర్లో జరిగింది. నాలుగో అంతస్తులో ఉన్న తమ అపార్ట్మెంట్ ముందు బిడ్డతో కలిసి నిలబడి ఉన్న ఒక తల్లి.. కాసేపు అలా చూసి, చేతుల్లోని బిడ్డను ఎత్తి కిందకు విసిరేసింది.
ఆ తర్వాత తను కూడా రెయిలింగ్ ఎక్కి కాసేపు అలా చూస్తూ ఉండిపోయింది. అదే సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మిగతా కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన యువతి డెంటిస్ట్‌గా ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగి.
తల్లి చేతులోనే ప్రాణాలు వదిలిన బిడ్డకు చెవులు సరిగా వినిపించవని, మాటలు కూడా రావని కుటుంబ సభ్యులు తెలిపారు. యువతి భర్త కేసు పెట్టడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆమె ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతుందా? అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోందని చెప్పారు.
A woman was arrested in #Bengaluru for killing her four-year-old mentally challenged daughter by throwing her from the fourth floor of a building, police said. pic.twitter.com/S96GaVblxx
— IANS (@ians_india) August 5, 2022