తిరువనంతపురం : మోడల్, యువ నటి (20) షహన కోజికోడ్‌లోని తన అపార్ట్మెంట్లో శుక్రవారం తెల్లవారుజామున అనుమానాస్పద పరిస్ధితిలో మరణించారు. నగరంలోని పరంబిల్ బజార్లో తన ఇంటి విండో రెయిలింగ్‌కు ఆమె వేలాడుతూ విగతజీవిగా కనిపించారు.
కట్నం కోసం భర్త ఆమెను వేధిస్తుండేవాడని, అతడే ఆమెను హత్య చేశాడని నటి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కూతురి వివాహమై ఏడాది దాటినా ఆమెను కలిసేందుకు తమను అనుమతించలేదని వారు వెల్లడించారు.
షహన భర్త సజ్జద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు. షహన, సజ్జద్లకు ఏడాదిన్నర కిందట వివాహం కాగా వీరిద్దరూ కాసర్గాఢ్కు చెందిన వారని పోలీసులు తెలిపారు.