e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్లు అమ్ముతున్న మెడిక‌ల్ రిప్రజెంటేటీవ్ అరెస్ట్‌

రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్లు అమ్ముతున్న మెడిక‌ల్ రిప్రజెంటేటీవ్ అరెస్ట్‌

రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్లు అమ్ముతున్న మెడిక‌ల్ రిప్రజెంటేటీవ్ అరెస్ట్‌

హైద‌రాబాద్ : రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్లు అక్ర‌మంగా విక్ర‌యిస్తున్న వ్య‌క్తిని న‌గ‌రంలోని హుస్సేనీఆలంలో సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కిష‌న్‌బాగ్‌కు చెందిన‌ మెడిక‌ల్ రిప్రజెంటేటీవ్‌ మెహ్మ‌ద్ ష‌ఫీయుద్దీన్‌(38)గా గుర్తించారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ష‌ఫీయుద్దీన్ ప్రైవేటు ఫార్మా కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. త‌క్కువ ధ‌ర‌కు రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్ల‌ను కొనుగోలు చేసి ఒక్కొటి రూ. 10 వేల నుండి రూ.15 వేల వ‌ర‌కు అమ్ముతున్నాడు. నిందితుడి వ‌ద్ద నుండి 20 రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఇంజ‌క్ష‌న్ల‌ను, నిందితుడిని త‌దుప‌రి విచార‌ణ నిమిత్తం హుస్సేనీఆలం పోలీసుల‌కు అప్ప‌గించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్లు అమ్ముతున్న మెడిక‌ల్ రిప్రజెంటేటీవ్ అరెస్ట్‌

ట్రెండింగ్‌

Advertisement