హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఇద్దరు మావోయిస్టులు అరెస్టు అయ్యారు. మధుకర్ చిన్నతో పాటు అతని భార్య శ్యామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిని గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌కు తరలించారు. మధుకర్, శ్యామలపై ఇప్పటికే ప్రభుత్వం రూ. 10 లక్షల రివార్డు ప్రకటించింది. పలు దాడుల్లో వీరిద్దరూ కీలక నిందితులుగా ఉన్నారు. మధుకర్ హైదరాబాద్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. శ్యామల ప్రముఖ షోరూం కంపెనీలో సేల్స్ విమెన్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.