Crime News | దారుణం.. ఓ వేడుకలో డ్యాన్స్ చేసిందని భార్య, ఇద్దరు పిల్లల దారుణహత్య.. ఆపై ఆత్మహత్య..!
Crime News | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం మొరేనా జిల్లా (Morena district) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. అనంతరం తానూ రైలు కిందపడి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. మాతా బసైయా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్పూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Crime News : మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం మొరేనా జిల్లా (Morena district) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. అనంతరం తానూ రైలు కిందపడి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. మాతా బసైయా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్పూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. 35 ఏళ్ల బలరామ్ కుష్వాహా (Balaram Kushwaha), అతడి భార్య, 32 ఏళ్ల రవితా కుష్వాహా (Ravita Kushwaha) మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. పదిరోజుల క్రితం గ్రామంలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో రవిత డ్యాన్స్ చేసింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
దాంతో రవిత పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు సర్దిచెప్పి జూన్ 24న తిరిగి అత్తగారింటికి పంపించారు. అయినప్పటికీ వారి మధ్య వివాదం సద్దుమణగలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి బలరామ్ తన భార్య, ఇద్దరు మైనర్ కుమారులను గొడ్డలితో నరికి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కొంతసేపటికే బలరామ్ మృతదేహాన్ని కూడా గుర్తించారు.
భార్యాభర్తల మధ్య చాలాకాలంగా గొడవలు ఉన్నాయిని, ఈ క్రమంలో డ్యాన్స్ విషయంలో జరిగిన గొడవ ఈ దారుణాలకు దారితీసిందని, తమ ప్రాథమిక విచారణలో ఈ వివరాలు వెల్లడయ్యాయని మొరేనా డీఎస్పీ విజయ్ భదోరియా వెల్లడించారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

