న్యూఢిల్లీ : యూపీలోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. నగరానికి సమీపంలోని లోని ప్రాంతంలో గోనెసంచీలో మహిళ మృతదేహం లభ్యమైంది. మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో మహిళను ఆమె బాయ్‌ఫ్రెండ్ హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏప్రిల్ 30న మహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 48 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన బాధితురాలు పెండ్లై భర్త నుంచి విడాకులు తీసుకుంది. భర్తతో వేరుపడిన అనంతరం ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తోంది.
మహిళ వేరొకరితో చనువుగా ఉంటోందని అతడిని పెండ్లి చేసుకుంటుందని నిందితుడు అనుమానంతో రగిలిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేసి గోనెసంచీలో వేసి లోని ప్రాంతంలో పడేశాడు. మృతురాలికి చెందిన టీవీ ఇతర వస్తువులతో నిందితుడు ఉడాయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.