Cyber Fraud | లింక్డిన్ వేదికగా వలపు వల : వృద్ధుడికి రూ. 6 కోట్లకు టోకరా
Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల ఆన్లైన్ వేదికగా నేరాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి.లింక్డిన్లో అమెరికన్ వ్యక్తిని (75) సంపన్న మహిళగా పరిచయం చేసుకుని ట్రేడింగ్ పేరుతో రూ. 6 కోట్లకు ముంచిన మహిళ ఉదంతం వెలుగుచూసింది.
Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల ఆన్లైన్ వేదికగా నేరాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి.లింక్డిన్లో అమెరికన్ వ్యక్తిని (75) సంపన్న మహిళగా పరిచయం చేసుకుని ట్రేడింగ్ పేరుతో రూ. 6 కోట్లకు ముంచిన మహిళ ఉదంతం వెలుగుచూసింది. వాల్‌స్ట్రీట్ కథనం ప్రకారం 75 ఏండ్ల ఓ అమెరికన్‌కు చైనాకు చెందిన యువ సంపన్న మహిళగా చెప్పుకునే మహిళ నుంచి లింక్డిన్ మెసేజ్ వచ్చింది. స్కామర్ తాను శాన్ఫ్రాన్సిస్కోలో నివసించే గోల్డ్ ఫీచర్స్ ట్రేడర్ వయోలైన్ చెన్‌గా బాధితుడికి పరిచయం చేసుకుంది.
విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌తో కూడిన ఫొటోలను షేర్ చేసింది. క్రమంగా వారి పరిచయం వాట్సాప్‌లో రోజూ చాట్ చేసుకునే వరకూ చేరింది. బాధితుడి నమ్మకం చూరగొనేందుకు స్కామర్ అతడితో సన్నిహిత సంబంధం నెరిపేందుకు మొగ్గుచూపింది. క్రమంగా అతడి అలవాట్లు, దాతృత్వ కార్యకలాపాల గురించి ఆరా తీసింది. నిందితురాలిని పూర్తిగా నమ్మిన బాధితుడు అన్ని వివరాలూ ఆమెతో పంచుకున్నారు. ఆపై వయోలైన్ తామిద్దరూ కలిసి తమ అంకుల్‌కు చెందిన ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఎఫ్ఎక్స్6లో ఇన్వెస్ట్ చేద్దామని ప్రతిపాదించింది.
ఇక బాధితుడితో కంపెనీ యాప్ ఫ్యూఎక్స్లో తొలుత 1500 డాలర్లు డిపాజిట్ చేయించింది. ఈ ప్లాట్‌ఫాంపై లాభాలతో ఆమెతో కలిసి రొమాంటిక్ రిలేషన్ కొనసాగించవచ్చనే ఆశతో బాధితుడు తన మ్యూచ్‌వల్ ఫండ్స్, షేర్లను తెగనమ్మి మూడులక్షల డాలర్లు పైగా ఫ్యూయక్స్ అకౌంట్లో డిపాజిట్ చేశాడు. దీంతో ఆ యాప్‌లో వీరిద్దరి జాయింట్ అకౌంట్లో పెట్టుబడులు 1.5 మిలియన్ డాలర్లకు పెరిగాయని చూపింది.
ఆ ఫండ్స్‌ను విత్‌డ్రా చేసేందుకు బాధితుడు ప్రయత్నించగా యాప్ నిర్వాహకులు అతడి రిక్వెస్ట్‌ను బ్లాక్ చేసి నిధులు విడుదల చేయాలంటే అదనపు ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక మిగిలిన పెట్టుబడులు, బ్యాంక్ రుణం, హోం-ఈక్విటీ లోన్ నుంచి భారీ మొత్తం సేకరించి యాప్ నిర్వాహకులు కోరిన మొత్తం చెల్లించాడు. ఆపై మహిళ సహా యాప్ నిర్వాహకులు పత్తా లేకుండా పోవడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ స్కామ్‌లో బాధితుడు ఏకంగా రూ. 6 కోట్లు నష్టపోయారు.
Read More :
Phone tapping | వైసీపీ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడింది.. డొక్కా మాణిక్య వర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

