కస్టడీలో చిత్రహింసలు… వ్యక్తికి విద్యుత్ షాక్‌లిచ్చిన పోలీసులపై చర్యలు
లక్నో: ఒక వ్యక్తిని కస్టడీలో చిత్రహింసలు పెట్టి విద్యుత్ షాక్‌లు ఇచ్చిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వారిని సస్పెండ్ చేయడంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని బదౌన్‌లో ఈ దారుణం జరిగింది. మే 2న పశువుల చోరీకి సంబంధించిన కేసులో 20 ఏళ్ల రోజువారీ కూలీ అయిన రెహాన్‌ను బదౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కస్టడీలో చిత్ర హింసలు పెట్టారు. లాఠీలతో ప్రైవేట్ భాగాలపై కొట్టడంతోపాటు విద్యుత్ షాకులు ఇచ్చారు. చివరకు రెహాన్ కుటుంబం నుంచి రూ.5,000 లంచం తీసుకుని ఆరోగ్యం క్షీణించిన అతడ్ని విడిచిపెట్టారు.
మరోవైపు తీవ్రంగా గాయపడిన రెహాన్‌ను అతడి కుటుంబ సభ్యులు తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రభుత్వ వైద్యులు చేతులెత్తేయడంతో మెరుగైన వైద్యం కోసం బులంద్‌షహర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బదౌన్ పోలీస్ స్టేషన్లో కస్టడీ చిత్ర హింసలపై రెహాన్ కుటుంబ సభ్యులు మీడియా ఎదుట వాపోయారు. పోలీసులు కర్రలతో ప్రైవేట్ భాగాలపై కొట్టడంతో పాటు కరెంట్ షాకులు ఇచ్చారని ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని చివరకు లంచం తీసుకుని విడిచిపెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో ఈ సంఘటన పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో నలుగురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. వారిపై నేర సంబంధ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
‘నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

