గురుగ్రాం : తనతో కలిసి ఓ సంస్ధలో పనిచేస్తున్న యువతిని అపహరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ల్యాబ్ టెక్నీషియన్ ఉదంతం గురుగ్రాంలో వెలుగుచూసింది. సెక్టార్ 52లో ఓ లేబొరేటరీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసే నిందితుడు సచిన్ తివారీ అక్కడ పనిచేసే యువతి (26) యూనిఫాం ధరించేందుకు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసి ఆమెను కోరిక తీర్చాలని బ్లాక్మెయిల్ చేశాడు. వీడియో క్లిప్ చూపుతూ నిందితుడు పలుమార్లు తనపై హోటల్లో లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
తాను గతంలో గర్భం దాల్చగా నిందితుడు అబార్షన్ చేయించాడని తెలిపింది. ఈ క్రమంలో మంగళవారం తనతో మాట్లాడాలని వజిరబ గ్రామానికి పిలిపించాడని, తాను అక్కడకు రాగా బలవంతంగా కారులో ఎక్కించుకుని బాద్షాపూర్ తీసుకువెళ్లాడని అక్కడ తనకు మత్తుపదార్ధాలు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు వివరించింది. తాను ప్రతిఘటించినా వినిపించుకోలేదని, తన అరుపులు విని స్ధానికులు అక్కడికి చేరుకోగా పరారయ్యాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.