బెంగళూర్ : పదో తరగతి చదివే బాలికపై 23 ఏండ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కర్నాటకలో వెలుగుచూసింది. నిందితుడిని అష్పాక్ రజెసబ్ అలిఖన్వర్గా గుర్తించిన అన్నిగెరి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బాలికను బలవంతంగా తన బైక్పై ఎక్కించుకున్న నిందితుడు ఆమెను పొలంలోకి తీసుకవెళ్లి దారుణానికి పాల్పడ్డాడు.
బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన విషయం తెలియగానే బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇక మరో ఘటనలో బెంగళూర్లో 16 ఏండ్ల బాలికకు మత్తుమందు ఇచ్చి నలుగురు వ్యక్తులు ఆరు రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితులందరినీ బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.