పుట్టింటికి వచ్చిన యువతిని దారుణంగా కొట్టిన కుటుంబ సభ్యులు

భోపాల్: అత్త వారి ఇంటిని వీడి పుట్టింటికి వచ్చిన ఒక యువతిని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టారు. బహిరంగంగా జుట్టు పట్టుకుని ఈడ్చి చితకబాది చెట్టుకు కట్టేశారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. గిరిజన వర్గానికి చెందిన 19 ఏండ్ల యువతికి మూడు నెలల కిందట పెండ్లి అయ్యింది. అయితే జూన్ 28న అత్త వారి ఇంటిని వీడిన ఆమె అలీరాజ్‌పూర్‌లోని తన పుట్టింటికి వచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె తండ్రి, కుటుంబ సభ్యులు ఆ యువతి జుట్టు పట్టుకుని ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చారు. అందరూ చూస్తుండగా కర్రలతో దారుణంగా కొట్టారు. మళ్లీ ఇక్కడకు తిరిగి వస్తావా అని ప్రశ్నిస్తూ చితక బాదారు. అనంతరం ఆమెను చెట్టుకు కట్టేశారు.
కాగా, ఈ ఘటనను కొందరు తమ సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో బాధితురాలి నుంచి స్టేట్మెంట్ తీసుకుని ఆమె తండ్రి, కుటుంబానికి చెందిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

