Cyber Fraud | ఫేక్ పేమెంట్ స్క్రీన్‌షాట్‌తో జ్యూవెలర్కు షాక్ : రూ. 2 లక్షల విలువైన గోల్డ్ కాయిన్స్ కొట్టేసిన స్కామర్
సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) రోజుకో స్కామ్‌తో చెలరేగుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా కేటుగాళ్లు ఏదో రూపంలో అమాయకులను ఆన్లైన్ వేదికగా అడ్డంగా దోచేస్తున్నారు.
న్యూఢిల్లీ : సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) రోజుకో స్కామ్‌తో చెలరేగుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా కేటుగాళ్లు ఏదో రూపంలో అమాయకులను ఆన్లైన్ వేదికగా అడ్డంగా దోచేస్తున్నారు. బాధితుల కష్టార్జితాన్ని క్షణాల్లోనే లూటీ చేస్తున్నారు. తాజాగా ఓ స్కామర్ గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేసి పేమెంట్ చేసినట్టు నకిలీ స్క్రీన్‌షాట్‌ను చూపడంతో జ్యూవెలర్ ఏకంగా రూ. 2 లక్షలు పోగొట్టుకున్నారు.
గురుగ్రాంలోని ఓ జ్యూవెలరీ స్టోర్‌లోకి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి రూ. 2 లక్షల విలువైన గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. గోల్డ్ కాయిన్స్ కొనుగోలు అవసరమైన డబ్బు ఆన్లైన్లో చెల్లిస్తానని స్టోర్ యజమానికి నమ్మబలికాడు. స్టోర్ యజమాని తన భర్త బ్యాంక్ వివరాలు అందించగా పేమెంట్ పూర్తిచేశానని నిందితుడు ఓ స్క్రీన్‌షాట్‌ను చూపాడు. అతడిని నమ్మిన స్టోర్ యజమాని ఆన్లైన్ పేమెంట్ పూర్తయిందునుకుని స్కామర్‌ను స్టోర్ విడిచివెళ్లేందుకు అనుమతించింది.
ఆపై జూవెలరీ స్టోర్ యజమాని ఖాతాలో ఎలాంటి డబ్బు జమ కాకపోవడంతో మోసపోయామని గుర్తించిన యజమాని అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త ముఖేష్ కుమార్ ఆస్పత్రిలో ఉండగా ఆయన బ్యాంకు ఖాతా వివరాలను నిందితుడికి పంపానని, అతడు చెల్లింపు పూర్తయిందని తన వాట్సాప్‌నకు స్క్రీన్‌షాట్ పంపాడని బాధితురాలు పేర్కొంది. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్‌ను చెక్ చేసుకుంటే తమ ఖాతాలో నగదు డిపాజిట్ కాలేదని గుర్తించామని తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read More :
Earthquake | అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Investments | పెట్టుబడుల కోసం ఏపీ పెడదారి..‘గైడెన్స్ తమిళనాడు’ ఉదంతంతో తెలంగాణలోనూ కొత్త అనుమానాలు
Corona Impact | దొంగలుగా మార్చిన కరోనా!.. హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Jabardasth Babu | జబర్దస్త్ బాబు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా… ఏడేళ్ల ప్రేమకు పెద్దల అంగీకారంతో శుభం కార్డు!
Hyderabad Students | సిమ్ లేదు.. నెట్వర్క్ అక్కర్లేదు.. సైనికుల కోసం బిట్స్ హైదరాబాద్ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ
SSC Exam | మార్చి 17 నుంచి పది పరీక్షలు?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

