న్యూఢిల్లీ : గర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్లో మాట్లాడుతుండగా వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడిన యువకుడి ఉదంతం ఢిల్లీలో వెలుగు చూసింది. కన్వర్ యాత్రను ముగించుకుని తిరిగి ఢిల్లీకి చేరుకున్న యువకుడు న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలోని తన ఇంటిలో ఈ దారుణానికి పాల్పడ్డాడు.
గర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్లో మాట్లాడుతూనే యువకుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తండ్రితో కలిసి నివసించే మృతుడిని ప్రశాంత్‌గా గుర్తించారు. ప్రశాంత్ ఇటీవలే కన్వర్ యాత్ర కోసం హరిద్వార్ వెళ్లి తిరిగి ఢిల్లీకి చేరుకున్నాడు. ఆపై గర్ల్‌ప్రెండ్‌తో వీడియో కాల్లో ఇద్దరి మధ్య వాదన చోటుచేసుకోగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనా స్ధలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.