ముంబై : ఆవుతో అసహజ లైంగిక చర్యకు పాల్పడ్డాడనే ఆరోపణలపై పుణేకు చెందిన దీపక్ రజ్వాదే (22)ను పుణే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై లోనావాల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుడు దీపక్ పుణేలోని కుసగాంలో నివసిస్తుంటాడని పోలీసులు గుర్తించారు.
మే 31న తన ఆవు పెద్దగా అరుస్తుండటంతో బయటకు వచ్చి చూడగా గోశాలలో ఆవును కట్టిపడేసిన యువకుడు దానిపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు గుర్తించానని ఫిర్యాదుదారు సతీష్ కకోరే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సతీష్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోగానే నిందితుడు దీపక్ ఘటనా స్ధలం నుంచి పరారయ్యాడు. సీసీటీవీ కెమెరాలో అసహజ లైంగిక చర్యకు పాల్పడుతూ దీపక్ పట్టుబడ్డాడు. సతీష్ పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు దీపక్‌ను అరెస్ట్ చేశారు.