న్యూఢిల్లీ : మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి మహిళ (35)పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఢిల్లీలో వెలుగుచూసింది. 2018లో నిందితుడు తరుణ్ మహజన్తో తనకు పరిచయం ఏర్పడిందని ఆపై తనను పెండ్లి చేసుకుంటానని చెప్పాడని బాధితురాలు ఆరోపించింది.
ఈ క్రమంలో తనకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి తాను స్ప్రహ కోల్పోగానే లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన ప్రైవేట్ ఫోటోలను కూడా షూట్ చేశాడని తెలిపింది.
తనను పెండ్లి చేసుకునేందుకు నిరాకరించిన నిందితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన ప్రైవేట్ ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడని ఆరోపించింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుడు మహజన్పై లైంగిక దాడి సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.