భోపాల్ : మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా మధ్యప్రదేశ్లోని కోట సమీపంలో దారుణం వెలుగుచూసింది. శివపురి జిల్లా భగోరా గ్రామంలో 9 ఏండ్ల బాలికపై దుండగుడు ఆదివారం లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. నిందితుడు గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. వైద్య పరీక్షలో బాలికపై లైంగిక దాడి జరిగిందని వెల్లడైందని చెప్పారు. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు.