Bank Robbery | పట్టపగలే బ్యాంకు దోపిడీ.. 5 నిమిషాల్లో రూ.14 లక్షలు దోచుకెళ్లారు
Bank Robbery | గుజరాత్ (Gujarat) లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ బ్యాంకులోకి చొరబడి దోపిడీ (Bank Robbery)కి పాల్పడ్డారు. బ్యాంకు ఉద్యోగుల్ని బెదిరించి 5 నిమిషాల్లో సుమారు రూ.14లక్షల నగదును దోచుకుని అక్కడి నుంచి ఉడాయించారు.
Bank Robbery | గుజరాత్ (Gujarat) లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ బ్యాంకులోకి చొరబడి దోపిడీ (Bank Robbery)కి పాల్పడ్డారు. బ్యాంకు ఉద్యోగుల్ని బెదిరించి 5 నిమిషాల్లో సుమారు రూ.14లక్షల నగదును దోచుకుని అక్కడి నుంచి ఉడాయించారు. సూరత్ (Surat)లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra ) బ్రాంచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఉదయం 11 గంటల సమయంలో ఐదుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాల్లో బ్యాంకు వద్దకు వచ్చారు. కస్టమర్లలాగా బ్రాంచ్ ముందు తమ వాహనాలను ఆపి హెల్మెట్స్తోనే దర్జాగా లోపలికి ప్రవేశించారు. వెళ్లీ వెళ్లగానే తమ వద్ద ఉన్న గన్ను, ఇతర ఆయుధాలతో బ్యాంకు ఉద్యోగుల్ని, అక్కడికొచ్చిన కస్టమర్లను బెదిరించి ఓ గదిలో బంధిస్తారు. అనంతరం కౌంటర్లో ఉన్న సుమారు రూ.14 లక్షల నగదును తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో సర్దుకొని పారిపోయారు. కేవలం 5 నిమిషాల్లోనే తమ పనిపూర్తి చేసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బ్యాంకులోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
ఊహించని ఈ ఘటనతో ఉద్యోగులు, కస్టమర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ మేరకు నగరంలో అలర్ట్ ప్రకటించారు. పలు రోడ్లను బ్లాక్ చేశారు. నగర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు చేపట్టారు. నగరంలో ఉన్న అన్ని సీసీటీవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బృందాలుగా విడిపోయి దొంగల కోసం గాలింపు చేపడుతున్నారు.
https://twitter.com/RitamappG/status/1689934091599372288?s=20
Also Read..
Actress Kasthuri | మరోవివాదంలో నటి కస్తూరి.. లేడీ సూపర్‌స్టార్ నయనతార కాదంటూ కామెంట్
Delhi Services Bill | రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లు
Jeff Bezos | ప్రియురాలి కోసం రూ.560 కోట్ల ఇంటిని కొనుగోలు చేసిన బెజోస్..?
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

