ప్రేమ పేరుతో మోసం..నిందితుడికి రెండేండ్ల జైలుశిక్ష
ప్రేమ పేరుతో మోసం | ప్రేమ పేరుతో పరిచయం ఏర్పరచుకొని, పెండ్లి చేసుకుంటానని నమ్మించి చివరకు మోసం చేసిన వ్యక్తికి న్యాయస్థానం రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.

వరంగల్ లీగల్ : ప్రేమ పేరుతో పరిచయం ఏర్పరచుకొని, పెండ్లి చేసుకుంటానని నమ్మించి చివరకు మోసం చేసిన వ్యక్తికి న్యాయస్థానం రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ నగరంలోని కాశిబుగ్గకు చెందిన బాధితురాలితో మండిబజారుకు చెందిన జన్మ శ్యాంసుందర్ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రేమ పేరుతో తొమ్మిది సంవత్సరాలు పరిచయం కొనసాగించాడు.పెండ్లి చేసుకుంటానని సదరు యువతిని మోసం చేశాడు.
యువతి నిలదీయడంతో పెండ్లి చేసుకుంటానని నమ్మించి స్థానిక కోటిలింగాల దేవాలయంలో పూలమాలవేసి మరుసటి రోజు నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఇంతేజారగంజ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కేసు దర్యాప్తు చేశారు.
నేరాన్ని రుజువు చేసేందుకు కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ అనిల్ కుమార్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్షాధారాలు పరిశీలించిన 9వ అదనపు జిల్లా జడ్జి ముక్తిదా నిందితుడికి రెండు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ తీర్పనిచ్చారు.
ఇవి కూడా చదవండి..
వరంగల్‌లో ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు
చెరువులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారం
పల్లె ప్రగతికి సహకరిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
న్యూజిలాండ్ సెలబ్రేషన్స్ చూసి తట్టుకోలేకపోయాం: అశ్విన్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

