Fire Accident | హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ మెట్రో రైలు స్టేషన్ సమీపంలోని ఫర్నీచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ షర్క్యూట్ వల్ల శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తున్నది. ఫర్నీచర్ షాప్ కావడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
స్థానికులు వెంటనే అగ్నిమాపక దళ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి నాలుగు ఫైరింజన్లు చేరుకుని మంటలు ఆర్పివేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మూడు అంతస్తుల్లో మంటలు ఎగిసి పడుతుండటంతో సమీపంలోని మరో మూడు దుకాణాలకు వ్యాపించాయి. దాదాపు రూ.40 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.