గురుగ్రాం : హర్యానాలోని గురుగ్రాంలో దారుణం చోటుచేసుకుంది. సోహ్న ప్రాంతంలోని 67 ఏండ్ల వ్యక్తి పొరుగింటిలోని ఆడ కుక్కను తన ఇంటికి తీసుకువచ్చి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. కుక్కపై అరాచకానికి తెగబడ్డ నిందితుడు సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సురేష్ పొరుగింటి వ్యక్తి ముఖేష్ ఆడ, మగ కుక్కను పెంచుతున్నాడు.
సెప్టెంబర్ 28న సురేష్ ఆడ కుక్కను తన ఇంటికి తీసుకువచ్చి దారుణానికి పాల్పడ్డాడు. ఆడ కుక్క కనిపించకపోవడంతో తాను సురేష్ ఇంటికి వెళ్లి చూడగా అతడు దానితో అసహజ శృంగారానికి పాల్పడుతున్న దృశ్యం కంటపడిందని చెప్పాడు. సురేష్ నిర్వాకాన్ని ముఖేష్ వీడియో రికార్డు చేశాడు. వృద్ధుడు ఇలాంటి నీచానికి పాల్పడతాడని తాను ఊహించలేదని అన్నాడు. నిందితుడిపై వీడియో ఆధారంగా ఫిర్యాదు చేయగా పోలీసులు సురేష్‌ను అరెస్ట్ చేశారు.