అహ్మదాబాద్ : మద్యం మత్తులో ఓ వ్యక్తి మహిళ ఇంట్లోకి చొరబడి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం సర్ధార్‌నగర్ ప్రాంతంలో వెలుగుచూసింది. మహిళ (34) ఫిర్యాదుతో నిందితుడు కల్పేష్ గుజ్జర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు గుజ్జర్ గురువారం రాత్రి బాధితురాలి ఇంటి ఎదుట నిలబడి వచ్చేపోయే వారిని దూషిస్తున్నారు. దీంతో బాధిత మహిళ అభ్యంతరం తెలుపగా తాగినమైకంలో ఆమె ఇంట్లోకి చొరబడిన నిందితుడు వీరంగం సృష్టించాడు. ఆమెను లైంగిక వేధింపులకు గురిచేయడంతో పాటు మహిళ భర్తను తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించాడు.
బాధితురాలి భర్తను బైక్‌తో ఢీకొట్టి చంపుతానని హెచ్చరించాడు. నిందితుడు గుజ్జర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.