ఆదివారం 07 జూన్ 2020
Crime - Mar 31, 2020 , 11:37:49

కారు నడిపిన కుక్క.. యజమానితో సహా అరెస్టు

కారు నడిపిన కుక్క.. యజమానితో సహా అరెస్టు

హైదరాబాద్: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో కుక్కతో కారు నడిపించిన యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. కుక్కను డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టుకుని యజమాని అలెజాండ్రో తాను పక్క సీట్లో కూర్చుని కారును ముందుకు దూకించాడు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో కారు పరుగులు తీసింది. అక్కడక్కడా ఇతర వాహనాలను ఢీకొట్టుకుంటూ ముందుకు సాగింది. పలువురు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ కారును వెంబడించారు. ఆగమని చేసిన సూచనలు పాటించకుండా దూసుకుపోతుండడంతో మేకుల పట్టా సాయంతో కారును నిలిపారు. డ్రైవింగ్ సీట్లో పిట్‌బుల్ జాతికి చెందిన పెంపుడు కుక్కను చూసిన పోలీసులు అవాక్కయ్యారు. అలెజాండ్రోపై పలు చట్టాల కింద కేసు నమోదు చేశారు. అతడిని కుక్కతో పాటు అరెస్టు చేసి జైలుకు పంపారు. పోలీసులు దగ్గరకగు వస్తుండే ఏమాత్రం గలాటా చేయకుండా కుక్క బుద్ధిగా లొంగిపోయిందట.


logo