కాచిగూడ : కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నల్లకుంట డివిజన్ గోల్నాకలోని భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన రమేశ్ కుమార్తె సగోల ఐశ్వర్య (16) కాచిగూడ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది.
ఈ నెల 5న ఉదయం కళాశాలకు వెళ్లి వస్తానని కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లిన ఐశ్వర్య ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు ఇళ్లలో వెతికినా ఆచూకి లభించకపోవడంతో తల్లి సంధ్య శుక్రవారం కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఇంట్లోంచి ఐశ్వర్య వెళ్లే సమయంలో తెలుపు రంగు టాప్, నీలి రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.