హైదరాబాద్: పొట్టకూటి కోసం నాలుగిళ్లలో పని చేసే ఒక మహిళ దురదృష్టవశాత్తూ మరణించింది. పని కోసం వెళ్లిన ఆమె లిఫ్టులో ఇరుక్కుపోయి దుర్మరణం పాలైంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని షేక్‌పేట్ సమీపంలో వెలుగు చూసింది. లక్ష్మీనగర్‌లో ఒక ఇంట్లో పని చేసేందుకు వెళ్లిన వీణ అనే మహిళ.. లిఫ్టులో చిక్కకుపోయింది.
38 ఏళ్ల ఆమెకు లిఫ్టులో ఊపిరందలేదు. అంత ఉదయాన్నే ఎవరూ నిద్రలేవ లేదు. దీంతో లిఫ్టులో ఆమెను రక్షించడం ఆలస్యమైంది. ఈ క్రమంలో లిఫ్టులో ఊపిరందని వీణ కన్నుమూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.