కొంతకాలంగా యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తున్న ఒక మైనర్ బాలికను.. యూట్యూబ్ స్టార్ చేస్తానని నమ్మబలికాడా నీచుడు. తనతోపాటు పక్క ఊరికి తీసుకళ్లాడు. అక్కడ ఒక ఫ్లాట్‌లో ఆమెను బలాత్కరించాడు. ఇంట్లో వారికి ఈ విషయం చెప్తే చంపేస్తానని బెదిరించి, ఆమెను తీవ్రంగా కొట్టాడు.
ఈ ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. ఇక్కడ ఒక 16 ఏళ్ల బాలిక గత మూడు, నాలుగేళ్లుగా యూట్యూబ్ వీడియోలు చేస్తోంది. ఈ క్రమంలోనే పాళి ప్రాంతానికి చెందిన నిజాముద్దీన్ అలియాస్ రాజ్ ఖాన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.
అతను కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తుంటానని ఆమెతో చెప్పాడు. ఈ నెల 8వ తేదీన ఒక యూట్యూబ్ వీడియో చేద్దామని చెప్పి, అమ్మాయిని జోధ్‌పూర్‌లోని ఒక ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు.
ఆమెపై దాడి కూడా చేశాడు. దీంతో ఆమె ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. అయితే ఇటీవల కుటుంబంతో కలిసి జోధ్‌పూర్ వచ్చిన సమయంలో తన బాధను కుటుంబానికి చెప్పేసింది. దీంతో నిందితుడిపై పోలీసు కేసు పెట్టిందా కుటుంబం. నిజాముద్దీన్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.