హయత్‌నగర్ రూరల్ : అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలో మంగళవారం తెల్లవారుజామున టాటా ఏస్ వాహనం బోల్తా కొట్టింది. నలుగురు అయ్యప్ప స్వాములు టాటా ఏస్ వాహనంలో మియాపూర్ నుంచి తెనాలికి బయలుదేరారు. జెన్నారం గండి మైసమ్మ గుడి దగ్గరకు రాగానే వాహనం డివైడర్‌ను ఢీకొని ఫల్టీలు కొట్టింది. అందులో ఉన్న స్వాములకు స్వల్ప గాయాలయ్యాయని మెట్టు సీఐ స్వామి తెలిపారు. క్షతగాత్రులను హయత్‌నగర్‌లోని పైవేటు దవాఖానకు తరలించారు.