భారత ప్రభుత్వం నిషేధించిన ‘త్రిపుల్ తలాక్ ’ విధానంలో తనకు విడాకులు ఇచ్చాడని ఒక యువతి తన భర్తపై కేసు పెట్టింది. ఇలా తనపై ఆమె కేసుపెట్టడంతో కోపం తెచ్చుకున్న సదరు భర్త.. ఇన్స్టాగ్రామ్లో 11 ఫేక్ అకౌంట్లు సృష్టించాడు. వాటితో ఆమెను హెరాస్ చేయడం ప్రారంభించాడు. ఆమెతోపాటు, కుమార్తెకు కూడా అసభ్యకరమైన మెసేజిలు వస్తున్నాయని, వీటన్నింటిని తన భర్తే పంపుతున్నాడని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 27 సంవత్సరాల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
30 సంవత్సరాల సదరు మహిళకు గతేడాది ఆమె భర్త త్రిపుల్ తలాక్ ఇచ్చాడు. దాంతో దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కోపం తెచ్చుకున్న భర్త.. ఆమెను ఇబ్బంది పెట్టేందుకు సోషల్ మీడియాను ఎంచుకున్నాడు. నకిలీ ఇన్స్టా ఖాతాలు సృష్టించి ఆమెను, కుమార్తెను వేధించసాగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.