పూడూరు : రోజు వారి కూలీగా ఫాం హౌజ్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, చన్గోముల్ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం… పూ డూరు మండల కేంద్రానికి చెందిన ఎండి.నవాజోద్దీన్ (45) కొంత కాలం నుంచి గ్రామ సమీపంలో ఉన్న జనప్రియ ఫాంలాండ్లో పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం ఫాంలాండ్లో విద్యుత్ సమస్యరావడంతో అక్కడే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను బంద్ చేసి వి ద్యుత్ సమస్యను చూసి ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో నవాజోద్దీన్ అక్క డికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని మృతదేహాన్ని వికారాబాద్ ప్ర భుత్వం దవాఖానకు తరలించి పోస్టు మార్టం అనం తరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.