భార్య సహకారంతో బాలికపై లైంగిక దాడి : దంపతులకు పదేండ్ల జైలు శిక్ష
18 ఏండ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో దంపతులకు సిటీ సెషన్స్ కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధించింది. భార్య సహకారంతో నిందితుడు బాబుభాయ్ వెగ్ధా బాలికపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడు.
అహ్మదాబాద్ : 18 ఏండ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో దంపతులకు సిటీ సెషన్స్ కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధించింది. భార్య సహకారంతో నిందితుడు బాబుభాయ్ వెగ్ధా బాలికపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. అనాధాశ్రమంలో పెరిగిన బాధితురాలు 18 ఏండ్లు రాగానే అమ్మమ్మ వద్ద నివసిస్తోంది. 2018లో బాలికను తమతో పంపాలని తాము హాస్టల్లో చేర్పిస్తామని కుటుంబసభ్యులను నిందితుడు కోరాడు.
ఆపై బాలికను హాస్టల్లో చేర్పించకుండా నిందితుడి దంపతులు నిర్బంధించారు. బాలికను గుడిలోకి తీసుకువెళ్లిన నిందితుడు ఆమెను పెండ్లి చేసుకున్నాడు. నిందితుడు బాబుభాయ్ ఇరుగుపొరుగు వారికి బాలికను తన భార్యగా పరిచయం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు నిందితుడి భార్య మధువని బాలికను తన కోడలిగా స్దానికులకు పరిచయం చేసింది.
బాబుభాయ్ పలుమార్లు తనను బెదిరించి భార్య సహకారంతో తనపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో ఆరోపించింది. నిందితుడు బాలికను అక్రమంగా నిర్భంధించాడని, స్ధానికుల ఎదుట బాలిక గురించి తప్పుడు ప్రచారం చేశారని కోర్టు స్పష్టం చేసింది. బాధితురాలితో పరస్పర అంగీకారంతో కాకుండా నిందితుడు భార్య సహకారంతో బలవంతంగా సంబంధం కొనసాగించాడని వెల్లడవుతోందని పేర్కొంది. గుజరాత్ బాధిత పరిహార పధకం కింద రెండు నెలల్లోగా బాధితురాలికి పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | ముకేష్, వర్షిణిపై మాటల యుద్ధం.. దేబ్జానీ ఎమోషనల్.. శివ, త్రిగుణ్ ఫైర్!
Kollapur | ఫంక్షన్ హాల్లో బర్త్ డే సెలబ్రేషన్ వద్దు.. అమ్మ సమాధి దగ్గరే కేక్ కట్ చేస్తా.. ఆరేళ్ల బాలుడి నిర్ణయానికి కన్నీళ్లు!
High Court | లోతుకుంట భూములపై స్టేటస్కో తొలగింపు
Gold Smuggling | పసిడికి సుంకాల సెగ.. దేశంలో భారీగా పెరిగిన బంగారం స్మగ్లింగ్!
IND vs NZ ODI | టాస్ గెలిచిన భారత్.. కివీస్‌కు బ్యాటింగ్.. టీమిండియా తుది జట్టు ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

