రాయ్‌పూర్: ఒక వ్యక్తిని తలకిందులుగా చెట్టుకు వేలాడదీసిన కొందరు దారుణంగా కొట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సిపట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన సెక్యూరిటీ గార్డు మహావీర్ ఇటీవల తన ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించినట్లు మనీష్ అనే వ్యక్తి ఆరోపించాడు. దీంతో తన కుటుంబ సభ్యులు అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు అతడు చెప్పాడు. ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించగా ఈ వ్యవహారాన్ని తాము సెటిల్ చేసుకుంటామని చెప్పడంతో మహావీర్ను పోలీసులు వదిలేశారు.
కాగా, అతడు మరోసారి చోరీకి యత్నించడంతో మనీష్‌తోపాటు మరికొందరు పట్టుకుని దారుణంగా కొట్టారు. మహావీర్ రెండు కాళ్లు తాడుతో కట్టి ఒక చెట్టుకు వేలాడదీసి మరీ చితకబాదారు. అతడు ఎంత మొరపెట్టుకున్నా వారు కనికరించలేదు. కొందరు దీనిని తమ మొబైల్లో రికార్డు చేశారు.
మరోవైపు ఈ చిత్రహింసలు చూసిన ఒక మహిళ, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దీని గురించి చెప్పింది. దీంతో పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లారు. చెట్టుకు వేలాడదీసి కొడుతున్న మహావీర్ను రక్షించారు. మనీష్‌తోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరి కొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
#WATCH Chhattisgarh | A man was thrashed by 5 people as he was hung upside down from a tree in Bilaspur district
(Viral video) pic.twitter.com/hjclQDmt7m
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 1, 2022