కాచిగూడ,సెప్టెంబర్ 3 : బాలికపై లైంగికదాడికి యత్నించిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై బద్దుల నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణానగర్ ప్రాంతానికి చెందిన 17 సంవత్సరాల యువకుడు గోల్నాక వెజిటెబుల్ మార్కెట్ ప్రాంతానికి చెందిన 15 సంవత్సరాల బాలికను బిల్డింగ్ టెర్రస్‌పై తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు.
ఇది గమనించిన బాలిక కుటుంబ సభ్యులు శుక్రవారం కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువకుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.