హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు, మహేశ్వరం వద్ద ఆదివారం ఉదయం ఓ కారులో మంటలు చెలరేగాయి. కారు గచ్చిబౌలి వైపు వెళ్తుండగా చిన్న గోల్కొండ స్ట్రెచ్ వద్దకు రాగానే కారులో పొగ రావడాన్ని డ్రైవర్ గమనించాడు. దీంతో కారులో ఉన్నవారంతా వెంటనే కిందకు దిగిపోయారు. నిమిషాల్లోనే కారు మంటల్లో చిక్కుకొంది. సమాచారం అందుకున్న మహేశ్వరం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసింది.