టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ నాయకుల దాడి

నాగర్కర్నూల్జ అచ్చంపేట రూరల్ : టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ నాయకులు దాడి చేసిన ఘటన జిల్లాలోని అచ్చంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద శనివారం చోటుచేసుకున్నది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుక్, రాష్ట్ర నాయకుడు ఆచారి ఎన్నిల ప్రచార సభ నిర్వహించారు.
ఈ సందర్భంలో సభ ఎదురుగా ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. రోడ్డు క్లియర్ చేస్తుండగా అటుగా వెళ్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు శంకర్మాదిగ, శ్రీనును త్వరగా వెళ్లాలని హెచ్చరిస్తూ బీజీపీ నాయకులు తోసేశారు.
దీంతో ఘర్షణ కాస్త పెద్దదిగా మారింది. శంకర్మాదిగను కిందపడేసి బీజేపీ నేతలు మరోసారి దాడికి దిగారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను నచ్చజెప్పి బీజేపీ నాయకులను చెదరగొట్టడంతో సద్దుమణిగింది.
ఇద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలపై సూమారుగా 100మంది బీజేపీ నాయకులు దాడికి పాల్పడం గూండాగిరిని తలపిస్తున్నదని పలువురు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి..
కర్నాటక జల దోపిడిపై సీఎం కేసీఆర్కు ఫిర్యాదు
కొత్తూరును కొత్తగా మారుస్తాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఆలోచించి ఓటు వేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి
అందరినీ ఒకే తీరుగా చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్
పాక్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

