కన్న కూతురుపై మళ్లీమళ్లీ అత్యాచారం.. ఫిర్యాదు స్వీకరించని పోలీసులు.. బాధితురాలి ఆత్మహత్య
Father harassed daughter: బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో ఘోరం జరిగింది. వివాహిత అయిన తనపై కన్నతండ్రే తరచూ అత్యాచారానికి పాల్పడుతుండటం, గయా ఎస్ఎస్పీతోపాటు మహిళా పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినా

పట్నా: బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో ఘోరం జరిగింది. వివాహిత అయిన తనపై కన్నతండ్రే తరచూ అత్యాచారానికి పాల్పడుతుండటం, గయా ఎస్ఎస్పీతోపాటు మహిళా పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఓ మహిళ తన ఎనిమిదేండ్ల కూతురును చంపేసి, తాను ఆత్మహత్య చేసుకుంది. గయా జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని లఖీబాగ్ ఏరియాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. లఖీబాగ్ ఏరియాలో ఓ 28 ఏండ్ల వివాహిత మహిళపై ఆమె తండ్రి తరచూ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విషయం బయటచెబితే పరువు పోతుందని బెదిరిస్తూ వీలు చిక్కినప్పుడల్లా అఘాయిత్యం చేస్తున్నాడు. దాంతో విసిగిపోయిన బాధితురాలు వారం రోజుల క్రితం గయా ఎస్ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆయన సూచన మేరకు స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌లో కూడా కంప్లెయింట్ ఇచ్చింది. కానీ పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. అది కుటుంబ తగాదా అని, ఇంట్లో తేల్చుకోవాలని చెప్పి పంపించారు.
పోలీస్‌స్టేషన్‌కు వెళ్లొచ్చిన తర్వాత కూడా అఘాయిత్యం..
బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో నిందితుడు మరింత రెచ్చిపోయాడు. ఫిర్యాదు చేసి వచ్చిన తర్వాత కూడా ఆమె అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడి ఇంట్లోనే బతుకుతుండటంతో బాధితురాలి భర్త కూడా మామ అఘాయిత్యాన్ని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి బాధితురాలు తన ఎనిమిదేండ్ల కూతరును గొంతు నులిమి చంపేసి తను కూడా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం రాత్రి తాను ఇంటికి వెళ్లి చూసేసరికి తమ గదిలో మంచంపై తన కూతురు విగత జీవిగా పడి ఉందని, భార్య ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ దృశ్యాలు చూసి తట్టుకోలేక తాను కూడా అదే ఫ్యాన్‌కు ఉరేసుకున్నానని, కానీ ఇంతలో ఇరుగుపొరుగు వాళ్లు వచ్చి తనను రక్షించారని తెలిపాడు. తన భార్య ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు పట్టించుకుని ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని అతను విలపించాడు.
మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Crime news
- Gaya
- Suicide
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

