డీజే సౌండ్‌కు మహిళ మృతి
సద్దుల బతుకమ్మ వేడుకల్లో డీజే సౌండ్ భరించలేక ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాధారంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది.
- సద్దుల బతుకమ్మ వేడుకల్లో విషాదం
కూసుమంచి (నేలకొండపల్లి), అక్టోబర్ 19 : సద్దుల బతుకమ్మ వేడుకల్లో డీజే సౌండ్ భరించలేక ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాధారంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. అప్పలనర్సింహాపురం గ్రామానికి చెందిన ఎలగాల భారతి (55) సద్దుల బతుకమ్మ కోసం చెరువుమాధారంలోని పుట్టింటికి వచ్చింది.
వేడుకల సందర్భంగా గ్రా మంలో నాలుగు డీజేలను ఒకేచోట పెట్టడంతో ఆ ప్రాంతమంతా శబ్దాలతో దద్దరిల్లిపోయింది. భారతి ఆ శబ్దాల ధాటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను నేలకొండపల్లి ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

