జియోకు భలే డిమాండ్
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు ముందు జియో ప్లాట్‌ఫామ్స్‌కు యాంకర్ బుక్ భలే కిక్కిచ్చింది. ప్రీ-క్వాలిఫైడ్ సంస్థాగత మదుపర్ల (యాంకర్ ఇన్వెస్టర్లు) నుంచి ఏకంగా 30 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి మరి. ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రూ.8,110 కోట్ల విలువైన షేర్లను కేటాయించి బుకింగ్‌కు వీలు కల్పించారు. అయితే దాదాపు రూ.2.5 లక్షల కోట్లకు సరిపడా బిడ్డింగ్ జరుగడం గమనార్హం.
- యాంకర్ బుక్కు విశేష స్పందన
- సంస్థాగత మదుపర్ల నుంచి 30 రెట్లు అధికంగా బిడ్లు
- రూ.8,110 కోట్లకు రూ.2.5 లక్షల కోట్లకు సరిపడా నమోదు
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు ముందు జియో ప్లాట్‌ఫామ్స్‌కు యాంకర్ బుక్ భలే కిక్కిచ్చింది. ప్రీ-క్వాలిఫైడ్ సంస్థాగత మదుపర్ల (యాంకర్ ఇన్వెస్టర్లు) నుంచి ఏకంగా 30 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి మరి. ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రూ.8,110 కోట్ల విలువైన షేర్లను కేటాయించి బుకింగ్‌కు వీలు కల్పించారు. అయితే దాదాపు రూ.2.5 లక్షల కోట్లకు సరిపడా బిడ్డింగ్ జరుగడం గమనార్హం. దీంతో బుధవారం (ఈ నెల 21) నుంచి మొదలయ్యే ఐపీవోలో రిటైల్ మదుపర్ల నుంచి విశేష స్పందన ఖాయమన్న అభిప్రాయాలు మార్కెట్ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా యాంకర్ బుక్ విజయాన్నిబట్టే ఐపీవోలో పబ్లిక్ సబ్స్క్రిప్షన్ ఏ స్థాయిలో ఉంటుందోనన్నదానిపై మార్కెట్ వర్గాలు ఓ అంచనాకు వస్తాయి. దీంతో జియో మెగా ఐపీవో.. రికార్డు స్థాయిలో సక్సెస్ కావడం గ్యారంటీ అన్న అంచనాలు గట్టిగానే వినిపిస్తున్నాయిప్పుడు.
సంస్థాగత మదుపర్లలో..
గ్లోబల్ అసెట్ మేనేజర్లు, సావరిన్ వెల్త్ ఫండ్లు, భారతీయ మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరర్లు, పెన్షన్ ఫండ్లు.. యాంకర్ బుక్‌లో పాల్గొన్నట్టు సమాచారం. వీరిలో బ్లాక్‌రాక్, క్యాపిటల్ గ్రూప్, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, టీ. రో ప్రైస్, స్క్రోడర్స్, జేపీ మోర్గాన్ అసెట్ మేనేజ్మెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్వెస్కో, జానస్ హెండర్సన్ తదితర విదేశీ అసెట్ మేనేజర్లతోపాటు సింగపూర్‌కు చెందిన జీఐసీ, అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, నార్వే నోర్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ వంటి సావరిన్ వెల్త్ ఫండ్లు, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాగే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఆదిత్యా బిర్లా సన్ లైఫ్, నిప్పాన్ ఇండియా, కొటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తదితర దేశీయ మ్యూచువల్ ఫండ్లు.. ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ పెన్షన్ ఫండ్స్, హెచ్డీఎఫ్సీ పెన్షన్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వంటి ఇన్సూరర్లూ ఉన్నారు.
1 బిలియన్ డాలర్లదాకా..
కొన్ని బడా విదేశీ ఇన్వెస్టర్లు, భారతీయ కంపెనీలు 750 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్లకుపైగా విలువైన షేర్ల కోసం బిడ్లు వేశాయని తెలుస్తున్నది. ఇక చాలావరకు టైర్-1 ఫండ్స్.. తమకు గరిష్ఠంగా సుమారు రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు షేర్లు అందుతాయని ఆశిస్తున్నాయి. అలాగే కనిష్ఠంగా రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు కేటాయింపులు జరుగవచ్చంటున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

