Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Digital arrest | సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) పన్నిన 'డిజిటల్ అరెస్ట్ (Digital arrest)' వలలో చిక్కి ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. బీహార్ (Bihar) రాజధాని పట్నా (Patna) లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Digital arrest : సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) పన్నిన ‘డిజిటల్ అరెస్ట్ (Digital arrest)’ వలలో చిక్కి ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. బీహార్ (Bihar) రాజధాని పట్నా (Patna) లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సైబర్ ఉచ్చులో సుమారు రూ.2.5 లక్షలు పోగొట్టుకోవడంతోపాటు నేరగాళ్ల వేధింపులు తట్టుకోలేక 22 ఏళ్ల గ్రాడ్యుయేట్ విద్యార్థిని ఆత్మహత్య (Suicide) కు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పట్నాలోని కంకర్‌బాగ్ ప్రాంతానికి చెందిన యువతిని సెప్టెంబర్ నుంచి సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. తాము ప్రభుత్వ అధికారులమని నమ్మించి చట్టపరమైన కేసులో ఇరికిస్తామని బెదిరించారు. ఈ ‘డిజిటల్ అరెస్ట్’ మోసంతో భయపడిపోయిన బాధితురాలు వారు చెప్పినట్టు పలు ఖాతాలకు విడతలవారీగా రూ.2.5 లక్షల వరకు బదిలీ చేసింది. అక్టోబర్ 5న ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అక్టోబర్ 6న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో అక్టోబర్ 10 శుక్రవారం రోజున కుమ్రార్ సమీపంలోని రైల్వేట్రాక్‌పై ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ ఫిర్యాదుపై పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తమ కుమార్తె బతికేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఫోన్ కాల్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు.
ఆమె ఖాతా నుంచి ఢిల్లీ, కేరళ, ఉత్తరప్రదేశ్‌లోని బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించారు. కాగా యువతి మృతదేహానికి 200 మీటర్ల దూరంలో మరో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కూడా లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ రెండు మరణాలకు ఏమైనా సంబంధం ఉందా..? అనే కోణంలోనూ పోలసులు విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

