బహిరంగంగా పాటలు పాడుతున్నందుకు… ట్రాన్స్‌జెండర్ భార్యను కత్తితో పొడిచిన భర్త
పాట్నా: బహిరంగంగా పాటలు పాడుతున్నందుకు, ట్రాన్స్‌జెండర్ భార్యను భర్త కత్తితో పొడిచాడు. బీహార్‌లోని సివాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆనంద్ కుమార్ అనే వ్యక్తి 2019లో చప్రా జిల్లాలోని జనతా బజార్ ప్రాంతంలో డ్యాన్స్ పార్టీలు నిర్వహించాడు. ఈ క్రమంలో సెమారియా ప్రాంతానికి చెందిన ట్రాన్స్‌జెండర్ రియా రాజ్ ప్రేమలో పడ్డాడు. దీంతో వారిద్దరూ కోర్టు అనుమతితో పెళ్లి చేసుకున్నారు. మహారాజ్‌గంజ్ రైల్వేస్టేషన్ సమీపంలోని అద్దె ఇంట్లో కలిసి జీవిస్తున్నారు.
కాగా, పెళ్లైన కొన్నేళ్ల తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. రియా తన బృందంతో కలిసి బహిరంగంగా, ఇళ్లకు వెళ్లి సెలబ్రెటీ పాటలు పాడటం మానేయాలని ఆనంద్ డిమాండ్ చేశాడు. దీని నుంచి మాన్పించేందుకు ఢిల్లీకి కూడా తీసుకెళ్లాడు. అయితే గ్రామానికి రియా తిరిగి వచ్చింది. మిగతా ట్రాన్స్జెండర్లతో కలిసి ఇళ్లకు వెళ్లడంతోపాటు బహిరంగంగా పాటలు పాడసాగింది.
దీంతో ఆగ్రహించిన భర్త ఆనంద్ ట్రాన్స్‌జెండర్ భార్య రియాను పలుసార్లు కొట్టాడు. అయినప్పటికీ తీరు మారకపోవడంతో కత్తితో పొట్టలో మూడుసార్లు పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రియాను స్థానికులు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆనంద్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

