హోటల్ గదిలో అనుమానాస్పదంగా… మహిళా పోలీస్ కానిస్టేబుల్ మృతి
ముంబై: ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్, హోటల్ గదిలో అనుమానాస్పదంగా మరణించింది. ఒక కేసు దర్యాప్తు కోసం ఇతర రాష్ట్రానికి వెళ్లిన ఆమె అక్కడ చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 25 ఏళ్ల కవితా కుమారి బీహార్ ముజఫర్‌పూర్ జిల్లాలోని బ్రహ్మపుత్ర పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్‌గా పని చేస్తున్నది. 2021లో నమోదైన చీటింగ్ కేసుపై దర్యాప్తు కోసం ఆమెతోపాటు మరి కొందరు పోలీసులు మహారాష్ట్రలోని పూణేకు వెళ్లారు.
అయితే మహిళా పోలీస్ కానిస్టేబుల్ కవితా కుమారి గురువారం మధ్యాహ్నం బావధాన్లోని చాందినీ చౌక్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ గదిలో అనుమానాస్పదంగా మరణించింది. సమాచారం అందుకున్న పూణేలోని హింజేవాడి పోలీస్ స్టేషన్ పోలీసులు ఆ హోటల్‌కు వెళ్లి పరిశీలించారు. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ప్రాథమిక ఆధారాల ఆధారంగా అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా పోలీసులతో కలిసి పూణే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

