గాయకుడి పాడు పని : బాలికను లోబరుచుకుని ఆపై..!
బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆమె అభ్యంతరకర ఫొటోలు తీసిన భోజ్‌పురి గాయకుడు అభిషేక్ (బాబుల్ బిహారి)ను పోలీసులు (Singer Arrest) అరెస్ట్ చేశారు.
గురుగ్రామ్: సోషల్ మీడియా వేదికలపై పాపులారిటీతో కొందరు పెడదారిన పడుతున్నారు. ఆన్లైన్ అడ్డాగా బాలికలు, యువతులను స్నేహం పేరిట వంచిస్తున్నారు. పరిచయం మాటున లోబరుచుకుని ఆపై బ్లాక్‌మెయిలింగ్‌తో వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆమె అభ్యంతరకర ఫొటోలు తీసిన భోజ్‌పురి గాయకుడు అభిషేక్ (బాబుల్ బిహారి)ను పోలీసులు (Singer Arrest) అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన అభిషేక్ (21) యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ 27,000 మందికి పైగా సబ్స్క్రైబర్లతో సోషల్ మీడియాలో పెద్దసంఖ్యలో ఫాలోయర్లను కలిగిఉన్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండేండ్ల కిందట నిందితుడు రాజీవ్‌నగర్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. స్నేహం పేరుతో 13 ఏండ్ల బాలికను అభిషేక్ హోటల్ రూంకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై ఆమె అభ్యంతరకర ఫొటోలను తీశాడు. ఘటన జరిగినప్పటి నుంచి గాయకుడికి బాలిక దూరంగా ఉంది.
కొద్దిరోజుల కిందట నిండితుడు బాలిక ఫొటోలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయగా వాటిని చూసిన బాధితురాలి కుటుంబ సభ్యులు బాలికను నిలదీయడంతో జరిగిన విషయం తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు గాయకుడు అభిషేక్‌ను అరెస్ట్ చేశారు.
Read More
Sharad Pawar | శరద్ పవార్‌కు హత్య బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన సుప్రియా సూలే
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

