శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Sep 13, 2020 , 16:52:27

క్వారంటైన్‌ సెంటర్‌లో మహిళపై అటెండర్‌ అత్యాచారం

క్వారంటైన్‌ సెంటర్‌లో మహిళపై అటెండర్‌ అత్యాచారం

థానే : కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 20 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడిన అటెండర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జూన్‌లో జరిగింది. అయితే సదరు మహిళ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవ్‌ఘర్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌ పాటిల్‌ వివరాలు వెల్లడించారు. మీరా రోడ్డు ప్రాంతంలోని ఉన్న క్వారంటైన్‌ సెంటర్‌లో 11 ఏళ్ల బంధువు వద్ద ఉండగా నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని మహిళ ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. కరోనా పాజిటివ్‌గా పరీక్షించిన బంధువును చూసుకునేందుకు ఆ మహిళ తన 10 నెలల కూతురుతోపాటు ఫెసిలిటీలోని ఓ గదిలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు.

రాత్రి సమయంలో నిందితుడు వేడినీళ్ల నెపంతో అక్కడికి వచ్చేవాడని, ఈ క్రమంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రతిఘటిస్తే తన బిడ్డను చంపుతానని బెదిరించాడని పేర్కొన్నారు. జూన్‌ మొదటివారంలో మూడు సందర్భాల్లో గదిలో ఉన్న మహిళపై అటెండర్‌ మూడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు తన కుటుంబ సభ్యులకు హాని తలపెడుతాడని భయపడి అప్పుడు పోలీసులను ఆశ్రయించలేదని తెలిపారు. మహిళ ఫిర్యాదు కేసు నమోదు చేసి, అటెండర్‌ను అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo